.
MHS HOME
>
వెంటాడే జ్ఞాపకం - (డా. సమన్న ఈటల)
వెంటాడే జ్ఞాపకం - (డా. సమన్న ఈటల)
08/12/2012 10:21
(డా. సమన్న ఈటల)
వెంటాడే
జ్ఞాపకం
నిగనిగలాడే నల్లని జుట్టు
నక్షత్రాల్లా మెరిసే నీలి కళ్ళు
సన్నజాజిలా విరబూసి
పెదాల పై తారాడే చిరునవ్వు
కల్లాకపటం తెలియని పసిపాప మనసు
యవ్వన తేజంతో పసిడికాంతులీనుతూ
మనస్సు రంజింపజేసే మనోహర రూపం
అరమరికలు లేని హృదయంతో
ఆకట్టుకునే ఆత్మీయపు పలకరింపు
వెల్లువలా ఉప్పొంగే మమతతో
నయనాలు వెలిగే ప్రేమమూర్తి
విధి ఆడిన వింత నాటకంలో
అమెరికా గడ్డపై అర్ధాంతరంగా
నెలరాలిన మా నయనతార!
గుర్తుకొస్తే
చాలు
...
గుండె బిగ్ బ్యాంగ్ లా విస్పోటం చెంది
కన్నులు నయాగరా జలపాతాలై
హృదయమంతా గాయాల జల్లెడౌతుంది
తలుచుకుంటే
చాలు
...
మనసంతా వేదనా భరితమై
విషాదమే ఉచ్హ్వాస నిశ్వాసలై
ప్రాణం ఆరిపోయే ప్రమిదవుతుంది
చెరగని వాడి స్మృతి వెంటాడే జ్ఞాపకమై
గుండె నిండా మానని పుండై
జీవితాంతం వీడని విషాదమవుతుంది !!
నిశాంత్
స్మృతిలో
...
నాన్న
- (
డా
.
సమన్న
ఈటల
)
Back
Search site
Search site
Contact
Gopi Ganesh. Alapaty
Hyderabad
8885201074
gopi_alap@yahoo.com
MHS HOME
MHS Memories
2012
15th August 2012
Alumni Meet 2012
TALENTS OF MHS
Suggessions
Events Calendar
Contact Us
MHS Inspirational
MHS Team
This website was built with Webnode
You can also have an impressive website for free!
Try it out